Weather Report: బి అలర్ట్.. తెలుగు రాష్ట్రల ప్రజలకు చల్లని వార్త
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా వాతావరణం చల్ల బడటంతో ఊపిరి పీల్చుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇలా మరో రెండు భారీ వర్షాలు ఉండటంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.
Telugu States Weather Report: సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్, మే నెలల్లో ఎండలు దంచి కొడతాయి. ఉక్క పోతతో, ఎండ కారణంగా చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏప్రిల్ చివరి వారం నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా వర్షాలు పడుతుండటంతో ఎండ దెబ్బ లేదు. ఎండలు మండి పోతున్నాయి అనుకుంటున్న సమయంలో వాతావరణ మార్పులతో తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య అనుకుంటూ వర్షాలను ఆస్వాదిస్తున్నారు.
అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ పట్టణ వాసులు మాత్రం ఎండ వేడి నుండి ఉపశమనం పొందుతున్నారు. ఈ అకాల వర్షాలు మరో రెండు మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వడగళ్లు మరియు ఊదురుగాలులతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పడుతున్నాయి.. మరో రెండు రోజుల పాటు పడబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొలాలు కోస్తున్న సమయంలో ఈ వర్షాలు పడుతున్న కారణంగా రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పండిన పంట అమ్మడం కోసం రైతులు కష్టాలు పడుతున్నారు.
మే 1వ తారీకు వరకు వర్షాలు ఆగిపోయి సాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయి అని వాతావరణ శాఖ పేర్కొంది. కానీ మరో రెండు మూడు రోజుల పాటు అంటే మే మొదటి వారం మొత్తం కూడా ఇదే తరహా వాతావరణం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా గత వారం పది రోజులుగా ఏదో ఒక చోట వర్షపాతం నమోదు అవుతూనే ఉంది.
Read More: Manobala Death : ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మనోబాల మృతి
విదర్భ నుండి తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతూ ఉంది. ఆ ద్రోణి కారణంగానే ఈ వర్షాలు నమోదు అవుతున్నాయి. పైగా బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తద్వార మే 8వ తారీకు నాటికి ఆగ్నేయ బంగాళాఖతంలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ వేసవి కాలంలో సగానికి పైగా రోజులు వర్షాలతోనే కొససాగేలా ఉంది.
పట్టణ వాసులకు ఈ వార్త చల్లని వార్త కానీ రైతులు మాత్రం కన్నీరును మిగుల్చుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా తమిళనాట కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. చెన్నై తో పాటు నీలగిరి, మదురై జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అక్కడ లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలతోనే సరిపెట్టే అవకాశం ఉంది.
Read More: Vikram Accident : హీరో విక్రమ్‌కి ప్రమాదం.. షూటింగ్‌లో గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook